కారులోంచి రూ.13 లక్షలను గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన నిజామాబాద్‌లోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్ టౌన్ ఎస్‌హెచ్‌వో లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలానికి చెందిన సూర్య రెడ్డి అనే వ్యక్తి.. నగరంలోని ఓ బ్యాంకు నుంచి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రూ.13 లక్షలు డ్రా చేశాడు. అనంతరం తన కారులో డబ్బులు పెట్టుకుని రూరల్ మండలంలోని కేశపూర్ గ్రామానికి తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు.
తిరిగి కారు వద్దకు వచ్చి చూసేసరికి కారులో ఉన్న రూ.13 లక్షలను గుర్తు తెలియని దుండగులు దొంగలించుకుపోయారు. దీంతో బాధితుడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ టౌన్ ఎస్‌హెచ్‌వో లింబాద్రి సీసీటీవీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ముగ్గురు వ్యక్తులు పల్సర్ బైక్ పై వచ్చి డబ్బును దొంగిలించినట్లుగా గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరు మహారాష్ట్రకు చెందిన ముఠాగా గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. వీరు ముగ్గురు సూర్య రెడ్డిని ఫాలో అయి.. దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రజలు ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవీ చదవండి: