Theft in petrol bunk: నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో బీభత్సం సృష్టించారు. పది మందికి పైగా... ముఠాగా వచ్చి పెట్రోల్ బంకుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన సిబ్బందిని బెదిరించి.. క్యాష్ కౌంటర్‌ను పగలగొట్టారు. అందులో ఉన్న రూ.40 వేలను దొంగలించారు.
బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీశైలంతో కలిసి నిజామాబాద్ సీపీ నాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: పదో తరగతి బాలుడితో ప్రేమాయణం.. ఉపాధ్యాయురాలు అరెస్ట్