గుర్తు తెలియని దుండగులు.. తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో జరిగింది. ఓ ఇంట్లో నుంచి రూ. 2.40 లక్షల నగదు, 70 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, ఓ బైక్.. మరో ఇంట్లో నుంచి రూ. 60 వేలు నగదు, ఓ బంగారు ఉంగరం అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. యజమాని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో యువకుడి దారుణహత్య