ETV Bharat / crime

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి... 45 తులాల బంగారం అపహరణ - భారీ దొంగతనం

తాళం వేసి ఉన్న ఇంటికి దొంగలు కన్నం వేశారు. సుమారు ముప్పై లక్షల విలువైన బంగారు, వెండి, నగదును దొంగలించారు. ఈ ఘటన నేరేడ్​మెట్​ పరిధిలోని కేశవ్​నగర్​లో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

robbery
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి.
author img

By

Published : Sep 6, 2021, 2:14 PM IST

మేడ్చల్​ జిల్లా నేరెడ్‌మెట్‌ పరిధి కేశవ్‌నగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరి జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు ప్రవేశించి.. సుమారు ముప్పై లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.

నేరేడ్​మెట్​లోని కేశవ్​నగర్​లో అనసూయ అనే మహిళ నివాసముంటుంది. ఆరోగ్యం బాగోలేదని ఈ నెల 1వ తేదీన ఆరోగ్యం బాగోలేదని... ఆమె చిన్న కుమారుడు సుధాకర్​ వద్దకు వెళ్లింది. సోమవారం ఉదయం సుధాకర్​ ఇంటికి వచ్చేసరికి బీరువా తాళాలు తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్​టీంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. 45 తులాల బంగారం, 4 కిలోల వెండి, నగదు అపహరించారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: జేబు దొంగల హల్​చల్​.. ప్రముఖుల కార్యక్రమాలే టార్గెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.