కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు గుడిలో చొరబడి పంచలోహ విగ్రహాలు, హుండీలోని సొత్తు దోచుకెళ్లారు. తెల్లవారుజామున గుడి తెరిచి లోనికి వెళ్లిన అర్చకులు ఆలయంలో స్వామివారి పంచలోహ విగ్రహాలు కనిపించపోయేసరికి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయంలో సీసీటీవి ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు. వీలైనంత త్వరగా దుండగులను పట్టుకుంటామని అన్నారు.