దుకాణంలో దొంగలు పడి.. ఎరువులు, విత్తనాలు దోచుకెళ్లిన ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలో చోటుచేసుకుంది. రూ.10 వేల నగదుతో పాటు.. రూ.లక్షా 33 వేల విలువగల ఫర్టిలైజర్లు చోరికి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీంతో పరిశీలించారు. దుండగులు.. దుకాణంలోని సీసీ కెమరాల డేటాను సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి: వీడియో వైరల్: సింగిల్ విండో ఛైర్మన్ లంచం డిమాండ్