ETV Bharat / crime

మాజీ ప్రియుడే కదా అని పర్సనల్​ ఫొటోలు పంపితే...! - Hyderabad Crime News

Woman Cheated By Unknown Person: బ్రేకప్ అయిన తర్వాత ప్రియుడు మళ్లీ ఫోన్ చేశాడు. ఆనంద పడ్డ యువతి... మళ్లీ మేం కలిశామని ముచ్చటపడింది. ఫోన్​లో ఎప్పటిలాగే గంటల తరబడి మాట్లాడుకున్నారు. ఓ రోజు ఫోన్​ చేసిన యువకుడు... తన పర్సనల్​ ఫొటోలు పంపమని అడిగాడు. ప్రియుడే కదా అని పంపింది. తీరా చూస్తే...!!

cheating
cheating
author img

By

Published : Jun 3, 2022, 11:59 AM IST

Woman Cheated By Unknown Person: విడిపోయిన ప్రియుడితో తిరిగి చిట్‌చాట్‌ చేస్తున్నానని ఆమె నమ్మింది. అతను కోరడంతో అర్ధనగ్న చిత్రాలు పంపించింది. ఓరోజు ఇద్దరూ ముఖాముఖి కలుసుకోగా, అతను మాజీ ప్రియుడు కాదని తెలుసుకొని ఆందోళనకు గురైంది. అతను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లికి చెందిన మహమ్మద్‌ మొహ్సిన్‌(22) పెయింటర్‌. ఇతను ఓ మహిళకు ఫోన్‌ చేసి రాజుగా పరిచయం చేసుకున్నాడు. ఆమె అతడిని తన మాజీ ప్రియుడిగా ఆమె భావించింది. అతనూ అలాగే నటించాడు. ఇరువురు నిత్యం మాట్లాడుకున్నారు. అతని కోరిక మేరకు అర్ధనగ్న చిత్రాలు పంపించింది.

అనంతరం ఓ రోజు ఇద్దరూ కలుసుకోగా.. ఆ యువకుడు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ కాదని తెలిసి కంగారుపడింది. అర్ధనగ్నచిత్రాలు ఫోన్‌ నుంచి తొలగించమని అతన్ని కోరింది. అతను డబ్బులివ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. లేకపోతే ఆ ఫొటోలను వైరల్‌ చేస్తానని బెదిరించాడు. ఆమె షీ టీమ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు మొహ్సిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తదుపరి చర్యల కోసం మలక్‌పేట ఠాణాలో అప్పగించారు. సెక్షన్‌385, 354 ఐసీసీ, 67ఏ ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని సంబంధిత శాఖ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.