ETV Bharat / crime

Blackmail: ఇంటర్‌ విద్యార్థినికి నరకం చూపించిన కేటుగాడు - telangana crime news

‘అతడు’.. ‘ఆమె’లా నటించాడు. ఇన్‌స్టాగ్రాంలో వల విసిరాడు. రోడ్డు ప్రమాదానికి గురయ్యానంటూ డబ్బు వసూలు చేశాడు. తిరిగి ఇవ్వమంటే పెళ్లి చేసుకుంటానంటూ నటించాడు. చివరకు వ్యక్తిగత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ ఇంటర్మీడియట్‌ విద్యార్థిని(18)కి నరకం చూపించాడు. ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

blackmail: ఇంటర్‌ విద్యార్థినికి నరకం చూపించిన కేటుగాడు

author img

By

Published : Sep 9, 2021, 8:25 AM IST

బాధితురాలికి ఇన్‌స్టాగ్రాంలో ‘ప్రియ464797’ అనే ఐడీ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఆమె యాక్సెప్ట్‌ చేసింది. తరచూ ఛాటింగ్‌ చేసేవాళ్లు. ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. తనకు సాయి అనే సోదరుడు ఉన్నాడని ప్రియ.. బాధితురాలికి చెప్పింది. తనతో మాట్లాడమని కోరింది. బాధితురాలు అంగీకరించడంతో అతని నంబర్‌ వచ్చింది. అప్పుడు బాధితురాలు వాట్సాప్‌లో ‘హాయ్‌’ అంటూ మెసేజ్‌ చేసింది. అప్పుడు సాయి తన వ్యక్తిగత వివరాలు, కుటుంబం, ఇతరత్రా విషయాల గురించి చెప్పాడు. కొన్ని రోజుల్లోనే వీరి మధ్య స్నేహం చిగురించింది.

రోడ్డు ప్రమాదానికి గురయ్యానంటూ..

ఒక రోజు సాయి.. బాధితురాలికి తాను రోడ్డు ప్రమాదానికి గురయ్యానంటూ మెసేజ్‌ చేశాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే ఈ ఘటన జరిగిందంటూ వివరించాడు. అత్యవసరంగా రూ.5 వేలు కావాలని అడిగాడు. నిజమేననుకుని బాధితురాలు తన తల్లి దగ్గర డబ్బు తీసుకుని గత నెల 23న ఫోన్‌పేలో పంపించింది. మరుసటి రోజు, ఆ తర్వాత రెండు దఫాలుగా మరో రూ.4 వేలు తీసుకున్నాడు. మొత్తం రూ.9 వేలు రెండ్రోజుల్లోనే తిరిగిస్తానంటూ నమ్మబలికాడు.

ఆ తర్వాత డబ్బు అడిగితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వ్యక్తిగత చిత్రాలు పంపించాలని అడిగితే ఆమె తిరస్కరించింది. అభ్యంతరకరంగా మెసేజ్‌లు పెడుతూ ఒత్తిడి తేవడంతో పంపించింది. మళ్లీ డబ్బు ఇవ్వకపోతే వ్యక్తిగత చిత్రాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్​లో పెడతానంటూ వేధించడం మొదలు పెట్టడంతో పోలీసులను ఆశ్రయించింది. ‘ప్రియా’ అనే పేరుతో నిందితుడే ఛాటింగ్‌ చేశాడని ప్రాథమికంగా నిర్థారించారు. అతని కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఇదీ చూడండి: Rape: వావివరుసలు మరిచిన తండ్రి... కన్న కూతురిపైనే అఘాయిత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.