వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్లో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో సరదాగా చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. ఫొటో తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.
హన్మకొండకు చెందిన మృతుడు ప్రణీత్(19).. హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు అతడి మిత్రులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: చేపల కోసం వెళ్లి.. చెరువులో పడి బాలుడు మృతి