ETV Bharat / crime

లైవ్​ వీడియో: మిత్రుని ప్రాణాలు తీసిన బైకర్​ దుస్సాహసం - యువకుడి మృతి

భయమో, అతి నమ్మకమో... ఓ వాహనదారుడు దుస్సాహసానికి ఒడిగట్టి ఒక ప్రాణం పోవటానికి కారణమయ్యాడు. పోలీసులు పెట్టిన గేటును ఆపకుండానే దాటుకుని పోవాలనే లక్ష్యంతో వెళ్లిన వాహనదారుడు... వెనకున్న మిత్రుని పరిస్థితి ఆలోచించలేకపోయాడు. ఈ అనాలోచిత, అవివేక చర్యతో విలువైన నిండు ప్రాణం క్షణంలో గాల్లో కలిసిపోయింది.

The young man died due to hit the check post gate at tapalapur

author img

By

Published : May 23, 2021, 7:59 PM IST

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌​ వద్ద విషాదం చోటుచేసుకుంది. అటవీశాఖ తనిఖీకేంద్రం వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. లాక్‌డౌన్‌ వేళ అధికారులు ఆపుతారనే భయంతో వేగంగా వెళ్లిన యువకుడు అతని మిత్రుడి మృతికి కారణమయ్యాడు.

వాహనం దూరంగా ఉన్నప్పుడే అటవీ అధికారి వాహనాన్ని ఆపమని సిగ్నల్​ ఇస్తూనే ఉన్నాడు. అదేమీ పట్టించుకోకుండా వేగంగా వచ్చిన వాహనదారుడు గేటు కింది నుంచి బైకును పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆ వాహనదారుడు బయటపడగా... వెనకున్న వ్యక్తి మాత్రం గేటుకు బలంగా ఢీకొని కిందపడిపోయాడు. ఆ అధికారి ఎంత ప్రయత్నించినా కుప్పకూలిన ఆ యువకుడి విలువైన ప్రాణం కాపాడలేకపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

మిత్రుని ప్రాణాలు తీసిన బైకర్​ దుస్సాహసం

ఇదీ చూడండి: కుమారుడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.