ETV Bharat / crime

WIFE SUICIDE VIDEO: కాపాడాల్సిన భర్తే.. మొబైల్​లో వీడియో తీశాడు - ఏపీ 2021 వార్తలు

మన కళ్లముందు ఎవరైనా కింద పడితేనే అయ్యోపాపం అని జాలి చూపిస్తాం. వీలైతే వారికి మన చేతనైనా సాయం చేస్తాం. అదే మనముందే ఎవరైనా ఆత్మహత్యకు యత్నిస్తే అడ్డుకునేందుకు కూడా వెనుకాడం. ఎంతటి కఠినాత్ములకైనా ఎక్కడో ఒకచోట మనసులో జాలి, దయ అనేది ఉంటుంది. కానీ ఓ దుర్మార్గుడు తన అర్ధాంగి ఆత్మహత్య చేసుకుంటుంటే అడ్డుకోవాల్సిందిపోయి రాక్షసత్వం ప్రదర్శించాడు. భార్యను కాపాడాల్సింది పోయి.. ఆమె ఉరేసుకుంటుంటే వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు. అంతే కాకుండా ఆ వీడియోను బంధువులకు పంపి తన పైత్యాన్ని చూపాడు.

WIFE SUICIDE - VIDEO
భార్యను ఆత్మహత్యను వీడియో తీసిన భర్త
author img

By

Published : Sep 22, 2021, 9:05 PM IST

Updated : Sep 23, 2021, 10:35 AM IST

WIFE SUICIDE VIDEO: కాపాడాల్సిన భర్తే.. మొబైల్​లో వీడియో తీశాడు

కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే.. ఆమె ఉరేసుకుంటుంటే కళ్లప్పగించి చూశాడు. ఎన్ని గొడవలు ఉన్నా.. ప్రాణాలు తీసుకుంటుంటే.. పగవాడైనా కాపాడేందుకు యత్నిస్తాడు. కానీ ఆ రాక్షసుడు ఆమెను ఆపకపోగా... ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ ఘటనను వీడియోలో బంధించాడు. అంతేకాకుండా ఆ వీడియోను బంధువులందరికీ పంపి పైశాచిక ఆనందం పొందాడు.

ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ ఘటన భర్త ప్రదర్శించిన పైశాచికత్వానికి ఓ పరాకాష్ఠగా నిలిచింది. కళ్ల ముందే భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపాల్సిన భర్త అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. అది చాలదన్నట్లు వీడియో తీసి ఆమె బంధువులకు పంపించాడు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

భార్య ఆత్మహత్యను వీడియో తీసిన పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్​గా పని చేస్తోంది. భార్య చనిపోయేందుకు ప్రేరేపించిన పైశాచిక భర్త పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బంది కోరుతుంది.

ఇదీ చూడండి: ENGINEERING STUDENT SUICIDE: ఎగ్​ దోశకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Last Updated : Sep 23, 2021, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.