ETV Bharat / crime

బీమా డబ్బు కోసం భర్తను చంపిన భార్య? - wife killed husband for policy money

మానవత్వం మంట కలిసిన రోజు... ప్రేమ ఆప్యాయతలు పక్కన పెట్టి...పలువురు భార్యా భర్తల బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇతర ప్రలోభాలకు లోనై... ధనార్జనే ధ్యేయంగా బీమా ఏజెంట్లతో చేతులు కలిపి సొంత భర్తనే కడతేర్చాడనే అభియోగం నల్గొండ జిల్లా వాడపల్లి పోలీస్​స్టేషన్​లో నమోదైంది.

the-wife-killed-her-husband-for-insurance-money-at-dhamara-cherla-nalgonda
బీమా డబ్బు కోసం భర్తను చంపిన భార్య?
author img

By

Published : Feb 25, 2021, 9:30 PM IST

బీమా డబ్బు కోసం భర్తను చంపిన భార్య?

నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో గతంలో బీమా డబ్బుల పేరిట వ్యక్తులను హతమార్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విషయం బయటకు రాకుండ చాకచక్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో బీమా ఏజెంట్లకు, లబ్ధిదారులకు మధ్య వివాదం తలెత్తడం వల్ల.. కొంత మంది రాజకీయ నాయకులు మధ్య మార్గంగా పరిస్థితిని చక్కదిద్దిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న తరుణంలో.. అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. దామరచర్ల మండలంలో గతంలో జరిగిన మాదిరిగానే తాజాగా దేవిరెడ్డి కోటి రెడ్డి మృతి జరిగిందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొండ్రపోలుకు చెందిన దేవిరెడ్డి కోటి రెడ్డి దామరచర్లలో ఉన్న.. ఓ వైన్ షాప్​కు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్​లో వర్కర్​గా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే పని పూర్తి చేసుకుని ఆయన ఇంటికి బయలుదేరాడు. కానీ బొత్తలపాలెం సమీపంలోని నార్కెట్ పల్లి-అద్దంకి హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో అతను మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భార్య రాళ్లవాగు తండాకు చెందిన ఓ వ్యక్తితో కలిసి.. కోటిరెడ్డిని హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మృతుని తల్లి, సమీప బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వాడపల్లి పోలీస్​స్టేషన్​లో మృతుని తల్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునారావృతం కాకుండా ప్రజలకు భరోసా కల్పించాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు.

ఇదీ చూడండి : వీలైనంత త్వరగా సీరం సర్వే చేయించండి : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.