తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కర్నూలు నగరంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు ఆదివారం ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న వెండి బయటపడింది. సెబ్ సీఐ రవిచంద్ర తమ సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేశారు.
నంద్యాలలోని సంజీవనగర్‌కు చెందిన జీఎం జూవెలర్స్ యజమాని దర్గా షేక్‌నాసిర్ హుస్సేన్ వద్ద 78 (13.341 కిలోలు) వెండి బిస్కట్లు దొరికాయి. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే వెండిని కర్నూలు తాలుకా అర్బన్ పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిరీక్షణకు తెర... పీఆర్సీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేసే అవకాశం