ETV Bharat / crime

సింగరేణి ఉద్యోగం కోసం మామని చంపిన అల్లుడు - The son in law who killed the uncle

Man kills father in law for singareni job : అత్తమామల్ని అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన అల్లుడు మామ పాలిట యముడయ్యాడు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన పాపానికి అల్లుడి చేతిలో హతమయ్యాడు. సింగరేణి ఉద్యోగం కోసం కన్నతండ్రి లాంటి మామను ట్రాక్టర్​తో గుద్ది దారుణంగా చంపాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో చోటుచేసుకుంది.

Man kills father in law for singareni job
మామను ట్రాక్టర్​తో తొక్కించి చంపిన అల్లుడు
author img

By

Published : Sep 6, 2022, 12:34 PM IST

Man kills father in law for singareni job : మామను ట్రాక్టర్​తో గుద్ది చంపిన విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో చోటుచేసుకుంది. గణపురం మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుండ్ల వాగు వద్ద బైక్​పై వస్తున్న మామను అల్లుడు ట్రాక్టర్​తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మామ బండారి ఓదెలు అక్కడికక్కడే మృతి చెందాడు.

Man kills father in law for singareni job in Ganapuram : ఎస్సై అభినవ్‌ తెలిపిన వివరాల ప్రకారం గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన బండారి ఓదెలు (58) సింగరేణి కార్మికుడు. బస్వరాజుపల్లి 8వ గనిలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు.ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగురు కుమార్తెలు. చిన్నభార్యకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.పెద్ద భార్యను రెండేళ్ల కిందట హత్య చేశారన్న అభియోగంతో ఓదెలుపై కేసు నమోదైంది. జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చారు. కుమారుల్లో ఒకరికి తన ఉద్యోగం ఇప్పించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. పెద్ద భార్య రెండో కుమార్తె రవళి భర్త నక్క రమేశ్‌ కూడా ఉద్యోగం కావాలని ఒత్తిడి చేస్తుండగా, ఓదెలు ససేమిరా అంటున్నారు. దీంతో మామను చంపాలని అల్లుడు నిర్ణయించుకున్నాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓదెలును పరశురాంపల్లి శివారులో రమేశ్‌ ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు.

దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రమేశ్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. అల్లుడితో భూతగాదాలపై ఓదెలు గతంలో ఫిర్యాదు చేయగా, పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.