మానసిక స్థితి సరిగా లేని వృద్ధురాలి(65)పై అత్యాచారం చేసినందుకు 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. 'నిందితుడు కొన్ని నెలల క్రితమే నౌపడలోని హౌసింగ్ సొసైటీలో పనిలో చేరాడు. వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోందని.. తన బంధువులు వారానికి రెండుసార్లు సందర్శించేవారని తెలుసుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు' అని పోలీసులు తెలిపారు.
'నవంబర్ 3న ఆ వృద్ధురాలు ఏడుస్తున్నట్లు ఇరుగుపొరుగువారు గుర్తించారు. ఆమె ఏదో అనారోగ్యంతో బాధపడుతుందని భావించి.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె లైంగిక వేధింపులకు గురైందని తెలిసింది' అని నౌపడా పోలీసులు తెలిపారు. అనంతరం అత్యాచారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మొదటగా సెక్యూరిటీ గార్డును అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం ఆ వృద్ధురాలి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: Road Accident: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం