ఏపీలోని ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి (రవీంద్ర) మృతి చెందారు. మద్యానికి బానిసైన రవీంద్రను ఆ అలవాటు మాన్పించేందుకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి తప్పించుకున్న రవీంద్ర.. బంజారాహిల్స్‌లోని హయత్ ప్యాలెస్ హోటల్‌కు వెళ్లాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న బంధువులు... హోటల్‌కు వెళ్లేసరికి రక్తపు వాంతులు చేసుకుని పడిపోయి కనిపించాడు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.