ETV Bharat / crime

బైక్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి - road accident in sadashiva nagar mandal

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.

accident in sadashiva nagar
సదాశివనగర్​లో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 23, 2021, 1:13 PM IST

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్​కు చెందిన దంపతులు బాల్​రాజ్​, అనురాధ(40) పనిరీత్యా బాన్సువాడకు బైక్​పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారిని ఢీ కొట్టింది.

అనురాధ తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త బాల్​రాజ్​కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.