ETV Bharat / crime

గుడిసెల తొలగింపు: 'కోర్టు స్టే ఉన్నా పోలీసుల దౌర్జన్యమేంటి..?'

ఖమ్మం నగరం రామచంద్రయ్య నగర్‌లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. స్థానికులు జేసీబీని అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళన కారులను అరెస్ట్​ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్​కు తరలించారు.

removal of huts
గుడిసెల తొలగింపు
author img

By

Published : Jun 25, 2021, 4:56 PM IST

ఖమ్మం నగరం 20వ డివిజన్‌ రామచంద్రయ్య నగర్‌లో ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు.. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు.. నిరసనకారులను, వారికి అండగా వచ్చిన పలువురు భాజపా నాయకులను అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్​కు తరలించారు.

స్థలాల కోసం గతంలో కోర్టును సైతం ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. గుడిసెలను తొలగించ వద్దని మానవహక్కుల సంఘం, లోకాయుక్త ఆదేశాలు కూడా ఉన్నాయంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, నగర పాలక సిబ్బంది.. ఏ సమాచారం ఇవ్వకుండా గుడిసెలను తొలగించటం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని బాధితులు వేడుకున్నారు.

20 ఎళ్లుగా ఇక్కడే జీవిస్తున్నాం. మాకే దిక్కు లేదు. గుడిసెలను తొలగిస్తే రోడ్డున పడతాం. ముందస్తు సమాచారం లేకుండా గుడిసెలను కూల్చి వేయడం అన్యాయం. కనీసం ఇంట్లోని సామాన్లు తరలించుకునేందుకు కూడా సమయం ఇవ్వరా..? ఇప్పటికిప్పుడు పసి పిల్లల్లను తీసుకొని ఎక్కడికని వెళ్లాలి..? ఇళ్ల స్థలాల కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకూ క్రమబద్ధీకరించలేదు. ఈ అంశంపై కోర్టులో కేసు నడుస్తున్నా.. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు.

-బాధితులు

అధికార పార్టీ మంత్రులకు కొన్ని వందల ఎకరాలున్నాయి. వాటిపై విచారణ చేపడతారా..? పేదోడి పట్ల ఇంత అన్యాయమెందుకు..? కోర్టు స్టే ఉన్నా.. పోలీసుల దౌర్జన్యమేంటి..? పేదలకు అన్యాయం జరుగుతుంటే కలెక్టర్​ కనీసం స్పందించడం లేదు. ఫోన్​లో సంప్రదించినా.. ఏ సమాధానం లేదు.

- శ్రీధర్‌, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

'కోర్టు స్టే ఉన్నా మీ దౌర్జన్యమేంటి..?'

ఇదీ చదవండి: KTR: రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్​ ప్లాంట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.