మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామంలో పాముకాటుతో వృద్ధురాలు మృతి చెందింది. రాత్రి సమయంలో ఆరుబయట కుటుంబ సభ్యులతో కలిసి గొల్లమోని రాములమ్మ(55) ఆరుబయట భోజనం చేస్తుంది. అదే సమయంలో ఇంటి సమీపంలో ఉన్న పొదల నుంచి వచ్చిన ఓ తాచుపాము వృద్ధురాలిని కాటువేసింది.
పాము కాటు వేసినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. జిల్లా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కళ్లేదుట చలాకీగా ఉండే ఆమె పాముకాటుతో మృతి చెందడంతో.. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
- ఇదీ చదవండి: అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త!