ETV Bharat / crime

మాజీ సర్పంచ్‌పై మావోయిస్టుల ఘాతుకం.. రాళ్లతో కొట్టి, తుపాకీతో కాల్చి.. - Maoist movements

Maoists killed Sarpanch in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి తమ ఘాతుకాన్ని ప్రదర్శించారు. దుర్గ్‌ కోదల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మాజీ సర్పంచ్‌ నోహర్‌ సింహ్‌ను పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నాడని నెపంతో రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం నాటు తుపాకీతో కాల్చారు.

Maoists killed
Maoists killed
author img

By

Published : Sep 19, 2022, 5:44 PM IST

Maoists killed Sarpanch in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. సర్పంచ్‌, మాజీ సర్పంచ్‌పై దాడి చేసిన మావోయిస్టులు... రాళ్లతో కొట్టి, నాటుతుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో మాజీ సర్పంచ్ నోహర్ ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏం జరిగిందంటే... మావోయిస్టుల సమాచారం పోలీసులకు అందిస్తున్నాడనే అనుమానంతో మాజీ సర్పంచ్​పై దాడికి పాల్పడ్డారు. రాళ్లతో కొట్టి.. ఆపై నాటు తుపాకీతో కాల్పి చంపారు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ని.. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నోహర్ మృతి చెందాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణ చేపట్టారు. గత నెలలో మృతుడు నోహర్ సింహ్ పోలీసుల ఇన్​ఫార్మర్​గా పని చేస్తున్నట్లు కరపత్రాలతో మావోయిస్టులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.