ETV Bharat / crime

అడ్డు వస్తున్నాడని పసివాడి ప్రాణాలు తీశాడు - హైదరాబాద్​ తాజా నేరాలు

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని 18 నెలల బాబు అహతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పీఅండ్‌టీ కాలనీలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

murder
వివాహేతర సంబంధం
author img

By

Published : Mar 31, 2021, 9:17 PM IST

2018లో అజయ్​ని మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి రోహిత్​ అనే బాలుడు పుట్టాడు. వారి మధ్య గొడవలు జరగటంతో 2020 జనవరిలో మౌనిక అజయ్​ని విడిచి పెట్టి బాబును తీసుకొని రాజు అనే వ్యక్తి వద్దకు వెళ్లింది. మౌనిక జీవనోపాధి కోసం ఓ క్యాటరింగ్​లో పనిచేస్తోంది. రాజు, మౌనికకు మధ్య వివాహేతరం సంబంధం ఏర్పడింది.

వీరికి సంబంధానికి ఆమె కుమారుడు రోహిత్ అడ్డుగా ఉన్నాడని భావించిన రాజు.. మౌనిక క్యాటరింగ్ పనులకు వెళ్లడం గమనించి ఆ బాలుని ఛాతిపై బలంగా పిడిగుద్దులు గుద్దటంతో రోహిత్ స్పృహ తప్పిపోయాడు. తర్వాత బాబుకు ఫిట్స్​ వచ్చిందని మౌనికకు చెప్పాడు​. ఇద్దరు కలిసి బాబును ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రోహిత్​ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బాబు మరణంపై తండ్రి అజయ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రాజును అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: 45 ఏళ్లు దాటినవారు టీకా వేయించుకోవాలి: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.