ETV Bharat / crime

Man Suicide at pochampad : విషాదం.. స్నేహితుడి మృతి తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య - తెలంగాణ ప్రధాన వార్తలు

Man Suicide at pochampad, pochampadu suicide case
స్నేహితుడి మృతి తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Jan 31, 2022, 3:43 PM IST

Updated : Jan 31, 2022, 5:38 PM IST

15:40 January 31

స్నేహితుడి మృతి తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

Man Suicide at pochampad : వారిద్దరూ స్నేహితులు. కష్టసుఖాలను పంచుకునే మంచి మిత్రులు. ప్రాణ స్నేహితులైన వారు ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఒకరు అంటే ఒకరికి ప్రాణాలు ఇచ్చుకునేంత ఇష్టం. ఎప్పుడూ జంట పక్షుల్లా కూడి ఉండేవారు. ఇది చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో..! కరోనా రూపంలో వచ్చి ప్రాణ స్నేహితుడిని కాటేసింది. ఆ బాధ భరించలేక మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేగాకుండా మిత్రుడి సమాధి వద్దే ఖననం చేయాలంటూ లేఖ రాశాడు.

ఏం జరిగింది?

pochampad suicide case : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడులో విషాదం నెలకొంది. స్నేహితుడి మృతి తట్టుకోలేక రవి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవి మిత్రుడు శ్రీనుకు కరోనా సోకింది. మహమ్మారితో పోరాడుతూ శ్రీను ఈనెల 13న మరణించాడు. ప్రాణ స్నేహితుడి మరణంతో ఎంతో కుంగిపోయిన రవి... ఉరి వేసుకొని ఉసురు తీసుకున్నాడు.

తన ప్రాణ స్నేహితుడు శ్రీను చనిపోయాడనే మనస్తాపంతోనే రవి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీను సమాధి పక్కనే ఖననం చేయాలని ఆత్మహత్య లేఖ రాశాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోసం హైకోర్టులో పోలీసుల పిటిషన్

Last Updated : Jan 31, 2022, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.