ETV Bharat / crime

స్నేహంగా నటిస్తూ బాలుడి కిడ్నాప్... నిందితుల అరెస్ట్

వారు కొన్ని నెలలుగా ఇంటి పక్కనే నివాసం ఉంటున్నారు. బాలుడితో స్నేహం నటించారు. ఎంచక్కా అనుమానం రాకుండా కిడ్నాప్ చేశారు. పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. భిక్షాటన, దొంగతనం చేయడానికి బాలుడిని అపహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

kidnap case solved in kurnool
కర్నూలు జిల్లాలో కిడ్నాప్​కు గురైన బాలుడిని గుర్తించిన పోలీసులు
author img

By

Published : Apr 24, 2021, 11:01 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లాలో కిడ్నాప్​కు గురైన 5 ఏళ్ల బాలుడిని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. స్వామినగర్​కు చెందిన దేవి కుమారుడు నాని ఈ నెల 19న కిడ్నాప్​నకు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

స్నేహంగా ఉంటూనే...

కొన్ని నెలలుగా ఇంటి పక్కనే స్నేహంగా ఉంటున్న నాగమణి, హరికృష్ణ దంపతులు బాలుడిని అపహరించారు. కిడ్నాప్ చేసి బాలుడిని డోన్ పట్టణంలోని మురళి అనే వ్యక్తి వద్ద ఉంచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఇంటి పక్కన ఉన్న వారే అపహరించారని గుర్తించి అరెస్టు చేశారు. భిక్షాటన, దొంగతనాలకు పాల్పడడంలో శిక్షణ ఇవ్వడం కోసమే.. బాలుడిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.