ETV Bharat / crime

సరదా కోసం వెళ్లి గల్లంతైన యువకుడు... లభ్యంకాని మృతదేహం - mahabubnagar district news

స్నేహితులతో కలిసి సరదాగా వాగులో స్నానం చేయడానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గజ ఈతగాళ్ల సాయంతో సుమారు రెండు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మృతదేహం లభ్యం కాలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. ఘటనా స్థలంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.

మున్నేరు వాగులో గల్లంతైన యువకుడు
మున్నేరు వాగులో గల్లంతైన యువకుడు
author img

By

Published : Jun 17, 2021, 10:41 PM IST

మద్యం మత్తులో ఓ యువకుడు మున్నేరు వాగులోకి దిగి గల్లంతైన ఘటన మహబూబాబాద్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. వెంకటేశ్వర బజార్‌కి చెందిన ఇర్ఫాన్ (30) అనే యువకుడు సరదాగా స్నేహితులతో కలిసి మున్నేరు వాగు సమీపంలో మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో వాగులోకి స్నానానికి దిగి గల్లంతయ్యాడు.

విషయం తెలుసుకున్న సీఐ వెంకటరత్నం వాగు వద్దకు వెళ్లి గజ ఈతగాళ్లతో సుమారు రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మృతదేహం లభ్యం కాలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. ఘటనా స్థలంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: Murder update: తల్లీకూతుళ్ల మృతదేహాలు పోస్టుమార్టానికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.