ETV Bharat / crime

పట్టపగలే యువతులపై దాడి.. పట్టించుకోని పోలీసులు..!

దాడులు జరిగితే సహించేది లేదని చెప్పిన పోలీసుల మాటలు అక్కడక్కడా నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తమ ఇంట్లోకి 20మంది వచ్చి దాడి చేశారని.. 100కు డయల్ చేశామని బాధిత యువతులు పేర్కొన్నారు. పోలీసులు వచ్చి చూసి వెళ్లిపోయారని.. పట్టించుకోలేదని వాపోయారు.

'The house was attacked by gopalakrishna people and  The police neglected' said by Affected women in karimnagar
మాపై దాడి జరిగినా.. పోలీసులు పట్టించుకోవడంలేదు!
author img

By

Published : Feb 13, 2021, 3:33 PM IST

హైదరాబాద్​కు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి అనుచరులు.. కరీంనగర్ జిల్లా సుభాష్​నగర్ రోడ్ నెంబర్ 7లో ఉన్న ఇంటిపై దాడి చేశారని బాధిత యువతులు తెలిపారు. ఇంట్లో ఉన్న సామాగ్రిని బయట పడేసి.. చిత్రహింసలకు గురి చేశారన్నారు. వారు 100కు డయల్ చేయగా.. ఘటనా స్థలానికి పోలీసులు నామమాత్రంగా వచ్చి వెళ్లారని, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

'2013లో కరీంనగర్​కు చెందిన చిగురు అనిల్ వద్ద 15 లక్షల రూపాయలతో ఇల్లు కొనుగోలు చేశాం. అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాం. హైదరాబాద్​కు చెందిన గోపాలకృష్ణ మా ఇల్లు కొనుగోలు చేశానని పలు మార్లు దాడులు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని' యువతులు వాపోయారు.

గోపాలకృష్ణ గూండాలతో ఇల్లుపై దాడి చేసి గోడను కూల్చివేసి ఇంట్లో ఉన్న సామాన్లను బయట పడేశారని తెలిపారు. యువతులు ఏడుస్తూ.. సహాయం చేయండి అంటూ బతిమిలాడడం కాలనీవాసులను కంటతడి పెట్టించింది. ఇంత జరిగినా పోలీసులు దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం గమనార్హం. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యువతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.