ఓ రైతు హార్వెస్టర్ కిందపడి తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం రుద్రారం గ్రామంలో జరిగింది. తన భర్త చావుకు వాహనం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుని భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
జిల్లాలోని రుద్రారం గ్రామానికి చెందిన బొమ్మారపు శ్రీనివాస్ తన పొలంలో వరి పంటను కోయించడానికి అదే గ్రామంలోని హరి ప్రసాద్‌కు చెందిన హార్వెస్టర్‌ను మాట్లాడుకుని గురువారం సాయంత్రం వరికోత ప్రారంభించాడు. డ్రైవర్ బండారి అంజయ్య అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి శ్రీనివాస్‌కు తగిలించాడు. ఈ క్రమంలో అతడు హార్వెస్టర్ ముందు భాగంలో పడడంతో తలకు, చేతులకు తీవ్రగాయ్యాయి.
గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ అంజయ్య కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలి: విద్యార్థి సంఘాలు