రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ మృతదేహంతో.. కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. ఘటనకు కారణమైన లారీ యాజమాన్యం.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ఆందోళనకు చేశారు. నల్గొండ జిల్లా, వేములపల్లిలో ఇది జరిగింది.
స్థానికురాలు లచ్చమ్మ.. గురువారం గేదెలను మేపడానికి వెళ్తూ రోడ్డు దాటబోయింది. వేగంగా వచ్చిన లారీ.. వారిని ఢీకొట్టింది. ఘటనలో మహిళతో పాటు రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ధర్నాతో.. రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని వారికి నచ్చజెప్పారు. న్యాయం జరిగేలా చూస్తామని హమీ ఇచ్చి.. అక్కడినుంచి పంపేశారు.
ఇదీ చదవండి: మంజీరా నదిలో దిగి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి