ETV Bharat / crime

daughter-in-law killed her uncle: వివాహేతర బంధం.. మామను కిరాతకంగా చంపిన కోడలు

crime news
crime news
author img

By

Published : Oct 16, 2021, 11:05 AM IST

Updated : Oct 16, 2021, 2:25 PM IST

11:03 October 16

ఆ పనికి అడ్డువస్తున్నాడని మామను చంపిన కోడలు

వివాహేతర సంబంధాలు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఎంతటి నేరానికైనా ఒడిగట్టేలా ప్రేరేపిస్తున్నాయి. నాతిచరామి అని ఏడడుగులు వేసి కడదాకా తొడుంటా అని ప్రమాణం చేసిన వారే.. జీవిత భాగస్వామిని కడతేరుస్తున్న ఉదంతాలు కొన్నైతే.. కట్టుకున్న వారి మరణానంతరం ఏర్పడుతున్న బంధాల వల్ల జరుగుతున్న నేరాలు మరికొన్ని.  

వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.  వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని మామనే ప్రియుడితో కలిసి హత్య చేసింది కోడలు. మామ చనిపోతే ఉన్న భూములు అమ్ముకోవచ్చు.. ప్రియుడితో జల్సాలు చెయ్యొచ్చని భావించింది. శుక్రవారం అర్ధరాత్రి బోయ కిష్టయ్య (75)ను ప్రియుడు నఫీస్ (21) తో కలసి గొంతు నులిమి హత్య చేసింది.  కోడలు మంగమ్మ (35) ఏమి తెలియనట్లు ఉదయం నాలుగు గంటలకు దాయాదుల ఇంటికి వెళ్లి.. మామ చనిపోయాడని, పిలుస్తే పలకడం లేదని కపటనాటకమాడింది.  వచ్చి చూడండి అని వారికి నమ్మబలికే ప్రయత్నం చేసింది.   

ప్రియుడికి పొలం రాసిచ్చేందుకు.. 

కిష్టయ్య మెడపై గాయాన్ని పరిశీలించిన బంధువులు, స్థానికలు మంగమ్మను నిలదీశారు. అయితే ఇక్కడ మాట మార్చిన మంగమ్మ.. మామ రాత్రి కల్లు తాగాడని, బోర్లపడి చనిపోయి ఉంటాడని బంధువులకు తెలిపింది. పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన బంధువులు.. మంగమ్మను చితకబాదారు. దీంతో అసలు విషయం చెప్పింది. ప్రియుడు నఫీస్​కు అర ఎకరం పొలం కావాలని, అతడికి పొలం రాసిచ్చే విషయంలో మామా అడ్డుపడుతున్నాడని అంతేకాకుండా తమ వివాహేతర సంబంధం విషయంలో అడ్డుపడకుండా ఉండేందుకు.. శుక్రవారం అర్ధరాత్రి వైరుతో గొంతు నులిమి హత్యచేసినట్లు నేరం ఒప్పుకుంది.  

మంగమ్మ భర్త నర్సింహులు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. భర్త చనిపోయే నాటికి మంగమ్మకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం నఫీస్​కు, మంగమ్మకు మధ్య బంధం ఏర్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగమ్మ అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.  

ఇవీ చూడండి: Man Was Killed in Jagtial: ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో దారుణ హత్య.. నరికి నరికి చంపిన దుండగులు

Last Updated : Oct 16, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.