ETV Bharat / crime

మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్​రావు​కు ఐదు రోజుల పోలీస్ కస్టడీ.. - ci Nageshwar Rao case latest updates

మహిళపై అత్యాచారం, కిడ్నాప్‌, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్టయిన మాజీ ఇన్​స్పెక్టర్​ నాగేశ్వర్‌రావు కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్​కు కోర్టు అంగీకరించింది. 5 రోజుల కస్టడీ అనుమతితో వనస్థలిపురం పోలీసులు.. మొత్తం ఘటనను సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.

మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్​రావు​ కస్టడీకి కోర్టు అనుమతి.. సీన్​ రీకన్​స్ట్రక్షన్​..

author img

By

Published : Jul 18, 2022, 3:58 PM IST

వివాహితపై అత్యాచారం, కిడ్నాప్‌, తుపాకీతో బెదిరింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్‌రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హయత్‌నగర్ కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వనస్థలిపురం పోలీసులు.. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగేశ్వర్‌రావును విచారణ కోసం ఠాణాకు తీసుకొచ్చారు. అత్యాచారం, హత్యాయత్నం జరిగిన ప్రదేశంతో పాటు కారు ప్రమాదం జరిగిన స్థలంలో పోలీసులు సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.

వనస్థలిపురం పీఎస్ పరిధిలో నివాసముండే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు హత్యాయత్నం చేసినట్లు వనస్థలిపురం పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు నాగేశ్వర్‌రావును ఈ నెల 10న అరెస్టు చేసిన పోలీసులు.. 11న రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో పురోగతి కోసం నాగేశ్వర్‌రావును కస్టడీకి ఇవ్వాలని హయత్​నగర్​ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా.. కోర్టు అంగీకరించింది.

సంబంధిత కథనాలు..

ఇవీ చూడండి..

యాప్‌ పసిగట్టింది.. బుల్లెట్‌ బండి దొరికింది

ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్​ఖడ్ నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.