The child was death in the pond: సాయంత్రం ఆడుకోవడానికి అని బయటకు వెళ్లి అదృశ్యమైన మూడేళ్ల బాలుడు రాత్రి చెరువులో శవంగా కనిపించిన ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాగోల్ అయ్యప్పకాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుమారుడిని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
నాగోల్ అయ్యప్ప నగర్ కాలనీలో నివాసం ఉంటున్న షేక్షావలీ, సాకీర(హేమలత) దంపతులకు మూడేళ్ల కుమారుడు సాహిద్ ఉన్నాడు. తండ్రి కూల పనుల నిమిత్తం నగరంలోకి వెళ్లగా, తల్లి ఇంట్లోనే ఉంటూ తమ ఒక్కగానొక్క కుమారుడిని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఆ ఇంటి ఆవరణలోనే ఆడుకుంటున్న సాహిద్ కాసేపు బయటకు వెళ్లాడు.
చాలా సేపటి వరకు తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లి చుట్టు పక్కల ఉన్నాడేమో అని వెతకడం మొదలు పెట్టింది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శవమై కనిపించిన కుమారుడు.. ఇది ఇలా ఉండగా బాలుడి ఆచూకీ కోసం ఇంటి దగ్గర ఉన్న స్థానికులు వెతకడం మొదలుపెట్టారు. చివరకు సాయంత్రం నాలుగు గంటలకు అదృశ్యమైన బాలుడు రాత్రి 11 గంటల సమయంలో సమీపంలోని చెరువులో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుని మృతిపై అనుమానం ఉందని, ఎవరో చెరువులో తోసి ఉంటారని బాలుడి తల్లి హేమలత ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: