ETV Bharat / crime

Pargi Baby slips from 2nd floor: ఆడుకుంటూ.. భవనంపై నుంచి పడి చిన్నారి మృతి - telangana crime news

Pargi baby building death incident: అప్పటిదాకా నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఆటుకుంటున్న బోసినవ్వుల పాపాయి... రక్తపు మడుగులో ఉండడం చూసి తల్లిదండ్రులు అంతులేని ఆవేదనకు గురయ్యారు. ముద్దుముద్దుగా మాటలు నేర్చుకుంటున్న చిన్నారి... భవనం మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Baby slips from 2nd floor and died
భవనంపై నుంచి పడి చిన్నారి మృతి
author img

By

Published : Nov 27, 2021, 1:43 PM IST

Child died falls from building while playing Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప కాలనీ భవనంపై నుంచి పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పరిగి మండలం రాపోలుకు చెందిన సందీప్‌ కుటుంబం అయ్యప్పకాలనీలోని ఓ భవనంలో అద్దెకు ఉంటోంది. ప్రైవేటు లెక్చరర్​గా పనిచేస్తున్న సందీప్ ఉద్యోగరీత్యా సందీప్‌ బయటకు వెళ్లగా... భార్య ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఈ సమయంలో బయటికి వెళ్లిన వారి కుమార్తె వర్ణిక... ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బాల్కనీలో నుంచి కింద పడింది.

భవనం మీది నుంచి పడిన చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సాయంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి శనివారం మృతిచెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బోసినవ్వుల పాపాయి మృతితో... తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: Shilpa Fraud: పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.