ETV Bharat / crime

Murder update: తల్లీకూతుళ్ల మృతదేహాలు పోస్టుమార్టానికి తరలింపు - దారుణ హత్య

సిద్దిపేట జిల్లాలో గత రాత్రి దారుణ హత్యకు గురైన తల్లీకూతుళ్ల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు గుగ్గిళ్ళ శ్రీనివాస్ పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడితో పాటు హత్యకు మరెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

brutal murder of the mother-daughter
brutal murder of the mother-daughter
author img

By

Published : Jun 17, 2021, 9:27 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులో బుధవారం రాత్రి దారుణ హత్యకు గురైన తల్లీకూతుళ్లు.. సారవ్వ (60), నిర్మల(30) మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిందితుడు గుగ్గిళ్ళ శ్రీనివాస్ పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయినట్లు తెలుస్తోంది.

తన అత్త, భార్యను అతి దారుణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని నిర్మల భర్త ప్రవీణ్ డిమాండ్ చేస్తున్నారు. నిందితుడైన తన బావమరిదితో.. చిన్న చిన్న భూ తగాదాలు తప్ప ఎప్పుడూ చంపుకునేంత పెద్ద గొడవలేమీ జరగలేదని వాపోయాడు. నిందితుడితో పాటు హత్యకు మరెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: MURDER: భూతగాదాలో తల్లీకూతుళ్ల దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.