హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే కూకటపల్లిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భద్రతా సిబ్బంది చనిపోగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మేడ్చల్ జిల్లాలో గండిమైసమ్మ కూడలిలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో గోడకు కన్నం వేసిన దుండుగులు చోరీకి విఫలయత్నం చేశారు.
గురువారం అర్ధరాత్రి బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఏటీఎం యంత్రం బండరాయితో ధ్వంసం చేసేందుకు యత్నించాడు. అయితే యంత్రం తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46మరణాలు