వికారాబాద్ జిల్లా తాండూర్ విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. నాటకీయ పరిణామాల మధ్య లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ దొరికాడు. డబ్బులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ సయ్యద్ ఫయాజ్ తెలిపారు.
తాండూర్ మండలం మల్కాపూర్‌లో నాపరాతి గనుల వ్యాపారం నిర్వహిస్తున్న ఖలీద్... 74 హెచ్‌పీ విద్యుత్ మోటార్ల సామర్థ్యాన్ని 40 హెచ్‌పీకి తగ్గించాలని ఆరు నెలల క్రితం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.40 వేలు లంచం ఇస్తేనే పని జరుగుతుందని... ఏడీఈ రాందాస్, కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్ తేల్చి చెప్పినట్టు బాదితుడు ఖలీద్ తెలిపాడు. ఆఖరికి రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ.20 వేలు ఇస్తానని బాధితుడు చెప్పాడు.
ఈ క్రమంలో బాధితుడు ఖలీద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు ఖలీద్ కార్యాలయానికి వెళ్లాడు. అదే సమయంలో అనిశా అధికారులు దాడులు చేశారు. కానీ ఏడీఈ లేకపోవడం వల్ల... కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్‌కు ఇస్తుండగా పట్టుకున్నారు.
ఇదీ చూడండి: నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు