ETV Bharat / crime

తల్లి మందలించిందని... పదోతరగతి విద్యార్థిని ఏం చేసిందో తెలుసా.. - తల్లి తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్య

ఫోన్​ ఎక్కువగా చూస్తుందని... తల్లి మందలింపుతో పదోతగరతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.

ssc student
ssc student
author img

By

Published : Aug 29, 2021, 8:47 AM IST

Updated : Aug 29, 2021, 8:56 AM IST

నల్గొండ జిల్లాకు చెందిన పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫోన్​ ఎక్కువగా వాడుతుందని తల్లి మందలింపుతో బలవన్మరణానికి పాల్పడింది. నల్గొండ జిల్లాకు చెందిన కావ్య... పదోతరగతి చదువుతోంది. లాక్​డౌన్​ కారణంగా పాఠశాలలు లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటోంది. ఈ మధ్యకాలంలో ఫోన్​ ఎక్కువగా చూస్తుందని... గుర్తించిన ఆమె తల్లి మందలించింది. మనస్తాపం చెందిన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కుటుంబసభ్యులు హుటాహుటిన నల్గొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ తీసుకెళ్లాలని వైద్యుల సూచనలతో ఎల్బీనగర్​లోని ఓ ప్రైవేటు​ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని నిన్న రాత్రి 12గంటల సమయంలో మృతి చెందింది.

వైద్యుల నిర్లక్షంతోనే..

వైద్యుల నిర్లక్షంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చికిత్స కోసం రూ.3లక్షలు తీసుకున్న వైద్యులు సరైన చికిత్స అందించలేదని.. ప్రాణాలు నిలబెడతారనుకుంటే ప్రాణం తీశారని ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఫోన్​ ఎక్కువగా వాడుతుందని ఆమె తల్లి మందలించిందని పురుగులమందు తాగింది. వెంటనే నల్గొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడి వైద్యులు హైదరాబాద్​ తీసుకెళ్లమన్నారు. శనివారం మధ్యాహ్నం 3.30కు ఎల్బీనగర్​లోని ఆస్పత్రిలో చేర్పించాం. వెంటనే రూ.1.50లక్షలు కట్టించుకున్నారు. బిడ్డ బతికే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత మరో రూ.1.50లక్షలు చెల్లించమన్నారు. రాత్రికి రాత్రే ఆ డబ్బును తీసుకొచ్చాం. అప్పటివరకు బతికే ఉందని చెప్పి.. అనుమానమొచ్చి ప్రశ్నిస్తే.. రాత్రి 12 గంటల సమయంలో పాప మృతి చెందిందని చెప్పారు. -మృతురాలి బంధువు.

ఇదీ చూడండి: CRIME: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. చివరికి..!

Last Updated : Aug 29, 2021, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.