ETV Bharat / crime

Bus Accident: బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు - తెలంగాణ వార్తలు

సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది(Bus Accident). ఈ ప్రమాదంలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Bus Accident, ten members injured
బస్సు బోల్తా, బస్సు ప్రమాదంలో గాయాలు
author img

By

Published : Aug 25, 2021, 7:59 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద 65వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది(Bus Accident). ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్ప గాయాల పాలయ్యారు. బాధితులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో బస్సులో మొత్తం 33మంది ప్రయాణికులు ఉండగా... ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

హైదరాబాద్(Hyderabad) నుంచి కాకినాడకు(Kakinada) వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో? తెలుసుకునేలోపే బస్సు బోల్తా పడిందని చెబుతున్నారు. బస్సు అద్దం పగలగొట్టుకొని బయటకువచ్చామని... ఆపై మిగతావారిని కాపాడినట్లు ప్రయాణికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మునగాల పోలీసులు... ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణాలని మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి: TS schools reopen : రేపటి నుంచి బడులకు ఉపాధ్యాయులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.