నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్పల్లి గ్రామానికి చెందిన 10 మంది వేటగాళ్ల(Hunters)ను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. చౌటపల్లి గ్రామ సమీపంలోని మశమ్మ మడుగు అటవీ ప్రాంతంలోకి మే 3న ముగ్గురు, 7న ఏడుగురు వేటగాళ్లు నిషేధిత ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించారు.
అతి కిరాతకంగా చుక్కల దుప్పి వంటి జంతువులను ముక్కలు ముక్కలుగా నరికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడే ఉఉన్న రహస్య కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా మే 29న ముగ్గురు, జూన్ 3న ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. వన్యప్రాణులకు హాని తలపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరించారు.
- ఇదీ చదవండి : Viral: కదులుతున్న రైలును ఎక్కబోయి...