Farmer Suicide : నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాకు చెందిన బానోతు లక్ష్మణ్(22) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. ఎంత ప్రయత్నించినా తనకు ఉద్యోగం రాలేదు. ఇంతలోనే తండ్రికి అనారోగ్యం. జబ్బు పడిన తండ్రి వ్యవసాయం చేయలేకపోయాడు. ఇక ఉద్యోగ వేట మాని తండ్రికి సాయంగా ఉండాలని సాగు బాటపట్టాడు లక్ష్మణ్. తమకు ఉన్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.
Farmer Suicide in Nalgonda : ఓవైపు దిగుబడి సరిగ్గా లేక.. మరోవైపు అకాల వర్షాలతో పండిన ఆ కాస్త పంట కూడా నష్టపోయి లక్ష్మణ్ అప్పులపాలయ్యాడు. ఓవైపు సాగు చేసిన అప్పులు.. మరోవైపు తండ్రి ఆరోగ్యం చేసిన ఖర్చు అంతా కలిసి దాదాపు రూ.4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో అర్థంగాక.. సాగు చేసే ధైర్యం లేక.. ఉద్యోగం కూడా రాలేదన్న బాధతో లక్ష్మణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు.
young man suicide : గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువకుణ్ని నల్గొండ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకురాగా.. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం వేకువజామున మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :
Farmer Suicide in mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురంలో విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం మరో రైతును బలితీసుకుంది. ఓవైపు మొలకెత్తుతోన్న ధాన్యం.. మరోవైపు కొనుగోలులో అలసత్వం.. ఇంకోవైపు పెరుగుతున్న అప్పులు.. ఇలా వెంటాడుతున్న బాధలతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పండించిన ధాన్యం కుప్పల వద్దే ప్రాణాలొదిలాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నేల తల్లినే దైవంగా.. అన్నం పెట్టే పంట పొలాలనే ప్రాణంగా భావిస్తూ ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. కాలం కలిసిరాక బక్క చిక్కిన బతుకులు.. పుట్టిన ఊరును, వ్యవసాయాన్ని వదులుకోలేక ఆ మట్టితోనే సహవాసం చేస్తున్నాయి. కానీ ప్రతిఫలం మాత్రం ఉరి తాడో, పురుగుల మందో మిగులుతోంది. నలుగురి ఆకలి తీర్చేందుకు ఎండనకా, వాననకా శ్రమిస్తున్న అన్నదాత.. పంట పెట్టుబడి సైతం రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. దీనికి తోడు కుటుంబ పోషణ, పశువుల దాణ.. అదనపు భారంగా మారాయి. వీటన్నిటినీ తన బలహీన భుజాలపై మోయలేక చావే శరణ్యమనుకుని బలవన్మరణం చెందుతున్నాడు. సంగారెడ్డి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం.. వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి