ETV Bharat / crime

Adilabad Accident Today: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు దుర్మరణం - three members died in accident

telugu news Three people died in Adilabad accident
Three people died in Adilabad accident
author img

By

Published : Dec 25, 2021, 7:53 AM IST

Updated : Dec 25, 2021, 2:12 PM IST

07:50 December 25

Utnoor Accidnet: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం

Adilabad Accident: ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఘటనా స్థలిలో నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ పెరికగూడకు చెందిన యువకుడు మృతిచెందాడు.

ఆదిలాబాద్​ జిల్లాలోని తడిహత్నూర్​కు చెందిన ముగ్గురు యువకులు.. ఇంద్రవెల్లిలోని శుభకార్యానికి బైక్​పై వెళ్లారు. వాళ్లు తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఉట్నూరు మండలానికి చెందిన ఓ యువ జంట ద్విచక్రవాహనంపై క్రిస్మస్​ ప్రార్థన కోసం వెళ్తున్నారు. ఉట్నూరు మండలం కుమ్మరి తాండ వద్ద ఈ రెండు బైక్​లు ఎదురురెదురుగా ఢీకొన్నాయి.

ముగ్గురు మృతి

ఈ ప్రమాదంలో తడిహత్నూర్​కు చెందిన ఇద్దరు యువకులు అక్కడిక్కకడే మృతి చెందారు. ఉట్నూరుకు చెందిన జంటకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. భర్త చనిపోయాడు. మృతుని భార్యను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్ జనార్ధన్ ఉట్నూరు మండల కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఇదీ చూడండి: gas leakage in chemical industry : రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఐదుగురికి అస్వస్థత

Last Updated : Dec 25, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.