ETV Bharat / crime

Minor Girl Suicide : ప్రేమను జయించలేక.. బాలిక ఆత్మహత్య

Minor Girl Suicide : తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ. ఆ ఆకర్షణే ప్రేమ అనుకున్న ఓ బాలిక.. యువకుడి వలలో పడింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఆ యువకుడు ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే.. ముఖం చాటేశాడు. మనస్తాపం చెందిన ఆ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

మైనర్ బాలిక ఆత్మహత్య, minor girl suicide
మైనర్ బాలిక ఆత్మహత్య
author img

By

Published : Dec 2, 2021, 10:11 AM IST

Minor Girl Suicide : ప్రేమను జయించలేక, ప్రియుడు కాదన్నాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(17) మాణిక్యారం పంచాయతీకి చెందిన యువకుడు నూనావత్‌ తారాచంద్‌(22) రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. బాలికను లోబర్చుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఆ మనస్తాపంతో విద్యార్థిని నవంబరు 28న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబీకులు ఖమ్మం వైద్యశాలకు తరలించడంతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్సై కుశకుమార్‌ కేసు నమోదు చేశారు. సీఐ ఆరీఫ్‌ అలీఖాన్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

woman suicide for dowry : అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురుని... వరకట్నం పేరుతో బలితీసుకున్నారంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని... పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

woman suicide news : పెళ్లి జరిగిన మూడో రోజుకే ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా బలవంతంగా వివాహం జరిపించడమే ఆమె ఆత్మహత్యకు కారణమని తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇష్టం లేకపోయినా, హింసిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని ఆ యువతి పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అతడి ప్రవర్తన మారకపోవడం వల్ల విడాకులు తీసుకుంది. అయినా అతడు ఆమెను విడిచిపెట్టలేదు. ముఖంపై యాసిడ్​ పోస్తానని బెదిరించాడు(acid attack). అది నిజమవుతుందని భయపడి ఆ యువతి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గాజిపుర్​లో జరిగింది(ghazipur suicide news). పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆసుపత్రిలో ఓ సాఫ్ట్‌ వేర్‌ యువతి ఉరేసుకుని ఆత్మహత్య(Software Engineer suicide) చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నీరసంగా ఉండటంతో చికిత్చ కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ డిశ్చార్జ్ సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని(Software Engineer suicide) మరణించింది. వైద్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.