Rajendranagar Murder Case: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో.. నిద్రిస్తున్న భార్యను అత్యంత కిరాతకంగా భర్త హత్య చేశాడు. రాజేంద్రనగర్‌లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్, సమ్రిన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఫర్వేజ్ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఫర్వేజ్-సమ్రిన్లకు 14 ఏళ్ల క్రితం వివాహం కాగా.. పెళ్లయిన నాటి నుంచే భార్యను వేధించటం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు భరించలేక.. భర్తపై కేసు పెట్టింది. కొన్ని నెలలు జైల్లో ఉన్న ఫర్వేజ్.. విడుదలయ్యాక పెద్దల సమక్షంలో రాజీపడ్డారు.
అప్పటినుంచి బాగానే ఉన్నా.. గత కొన్ని రోజులుగా ఫర్వేజ్కు భార్యపై మళ్లీ అనుమానం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం రోజురోజుకు పెరిగి పెనుభూతంగా మారింది. ఎంత చెప్పినా భార్యలో మార్పు లేదన్న అపోహతో.. చంపేద్దామని నిశ్చయించుకున్నాడు. అందుకోసం నిన్న రాత్రి ఓ కత్తిని కొనుగోలు చేశాడు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వెళ్లిన ఫర్వేజ్.. భార్య నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. గాఢ నిద్రలో ఉన్న సమ్రిన్పై కత్తితో దాడి చేశాడు. అప్పటికీ కసితీరక సమ్రిన్ తలను శరీరం నుంచి వేరుచేశాడు. అనంతరం.. తలను తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి లొంగిపోయాడు.
గంజాయి మత్తులో..?
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసునమోదు చేశారు. అనంతరం ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యపై అనుమానంతోనే ఫర్వేజ్ హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపించారు. వివరాలు సేకరించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Husband killed wife: ఆడపిల్లలు పుట్టారని పచ్చి బాలింతను హతమార్చిన భర్త!