Online Gaming Cyber Crime : సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల చొరవతో ఓ బాధితుడు.. తన మనవడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం వల్ల కోల్పోయిన రూ.11.5లక్షలను తిరిగి పొందారు. పోలీసుల ఐదు నెలల కృషి ఫలితంగా డబ్బులు తిరిగి వచ్చాయి. సైబర్ క్రైమ్ డీసీపీ లావణ్య ఎన్‌జేపీ కథనం ప్రకారం నగరానికి చెందిన సయ్యద్ అజ్గర్‌అలీ చరవాణితో ఆయన మనవడు(8) జులై 19న ఆన్‌లైన్ గేమ్స్ ఆడాడు. ఈ క్రమంలో తాత ఖాతాలోని రూ.11.5లక్షలు మాయమయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సింగపూర్‌లోని ఓ గేమింగ్ సంస్థకు ధారపోసినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆ సంస్థలను సంప్రదించారు. ఐదు నెలలుగా వారితో చర్చలు జరపగా ఎట్టకేలకు సంస్థ డబ్బులు తిరిగి చెల్లించింది. డబ్బు తిరిగి రావడంతో తాత మోములో ఆనందానికి హద్దులేకపోయింది.
Online Gaming Crimes Today : అంతా బాగానే ఉంది కానీ.. గేమ్ ఆడితే ఖాతాలో నుంచి డబ్బు ఎలా మాయమైందనే విషయంపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. సైబర్ కేటుగాళ్లు ఇన్నాళ్లు.. ఓటీపీ, కేవైసీ, ఫేక్ కాల్స్‌తోనే నగదు కాజేసేవారు. ఇప్పుడు ఇలా పిల్లలు ఆడే ఆటల పైనా వారి కన్నుపడింది. ఇక నుంచి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. ఇంట్లో పిల్లలు గేమ్స్ అడుతున్నప్పుడు కాస్త గమనించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి :