ETV Bharat / crime

Dead body in Water tank: వాటర్​ ట్యాంకులో మృతదేహం వివరాలు గుర్తింపు.. వాటి ఆధారంగా నిర్ధరణ - వాటర్​ ట్యాంకులో మృతదేహం కేసు

Dead body in Water tank case : తాగు నీటి ట్యాంకులో మృతదేహం కేసు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడు చిక్కడపల్లికి చెందిన కిశోర్​గా పోలీసులు గుర్తించారు. అతను ధరించిన దుస్తులు, చెప్పుల ఆధారంగా విషయం బయటపడింది. కిశోర్​ది హత్యా, ఆత్మహత్యా, లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా స్థానికులు ఇవే నీటిని తాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో చిన్న పిల్లలకు సైతం ఇవే నీళ్లు తాగించామని వారు వాపోతున్నారు.

Dead body in Water tank
వాటర్​ ట్యాంకులో మృతదేహం కేసు
author img

By

Published : Dec 8, 2021, 12:37 PM IST

Updated : Dec 8, 2021, 2:30 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ రిసాలగడ్డలోని తాగునీటి ట్యాంకులో లభించిన మృతదేహం కేసులో... మృతుడిని పోలీసులు, అతని కుటుంబసభ్యులు గుర్తించారు. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కిశోర్​గా వెల్లడైంది. గత నెల 23నుంచి అతను కనిపించడంలేదంటూ కుటుంబసభ్యులు పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. అయితే తాగునీటి ట్యాంక్ వద్ద లభించిన చెప్పులు మాత్రం కిశోర్​ స్నేహితుడివిగా బయటపడింది. కిశోర్,​ అతని స్నేహితుడు కలిసి తరుచూ నీటి ట్యాంక్ వద్దకు చేరుకుని మద్యం, గంజాయి వంటివి సేవిస్తుంటారని దర్యాప్తులో తేలింది. అయితే కిశోర్​ది ఆత్మహత్య, హత్య లేదా ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కిశోర్‌ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలేం జరిగింది.. చెప్పులు ఎందుకు నీటి ట్యాంకు వద్ద ఉన్నాయి.. కిశోర్​ మృతదేహం లభించిన నీటి ట్యాంక్ రెండు మూతలు కూడా మూసివేసి ఉండటంతో పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

వైద్య పరీక్షలు

మృతదేహం ఉన్న ట్యాంకులోని నీటిని స్థానికులు 20రోజులుగా తాగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిసాలగడ్డలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వైద్య బృందం తిరిగి పర్యటించింది. స్థానికులెవరైనా అనారోగ్యం బారిన పడ్డారా.. పరిస్థితి ఏ విధంగా ఉందంటూ వైద్యులు ఆరా తీశారు. స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనారోగ్యం బారిన పడిన వారు వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కిశోర్​ మృతిపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

ఫిర్యాదులు చేసినా

కిశోర్‌ అదృశ్యంపై 15 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల కనిపించకుండా పోయిన వ్యక్తుల కేసులపై పోలీసులు ఆరా తీశారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లలో నమోదైన కేసులపై దృష్టిసారించారు. నీటి ట్యాంక్‌లో కుళ్లిన మృతదేహం లభ్యమవగా.. చనిపోయింది అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కిశోర్‌ అని పోలీసులు నిర్ధరించారు. స్థానికులు ఇదే ట్యాంకులోని నీటిని తాగుతుండటంతో ఆందోళన చెందారు. నీళ్లు దుర్వాసన వస్తున్నాయని జలమండలి అధికారులకు ఫిర్యాదుచేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఉంటే మృతదేహాన్ని ముందే గుర్తించేవారని స్థానికులు చెబుతున్నారు.

అస్థిపంజరంగా మారి..

మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జలమండలి సిబ్బంది ట్యాంకును శుభ్రం చేసేందుకు ఆరుగురు కూలీలను ట్యాంకుపైకి పంపించారు. కూలీలు ట్యాంకుపై ఉన్న మూతను తొలగించి లోపలికి దిగుతుండగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు భయంతో కిందికి వచ్చి విషయాన్ని సిబ్బందికి చెప్పారు. వెంటనే జలమండలి సిబ్బంది ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌యాదవ్‌, డీఐ వెంకన్న, సెక్టార్‌ ఎస్సై శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని జీహెచ్‌ఎంసీ అత్యవసర విభాగం డీఆర్‌ఎఫ్‌ సహాయంతో సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు వారం, పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ముందే స్పందించి ఉంటే

Dead body in Water tank: ఈ ట్యాంక్​ నీరు నాలుగు బస్తీలకు వెళ్తుంది. శివస్థాన్​పూర్​, హరినగర్​, పద్మశాలి కాలనీ సహా మరో బస్తీకి ఈ నీరు సరఫరా అవుతోంది. ఈ వారంలో ఓ ఇంట్లో.. నీటిలో నుంచి వెంట్రుకలు, మాంసం ముద్దలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని స్థానిక కార్పొరేటర్​ తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అందుకు కారణం గుర్తించలేకపోయారని స్థానికులు తెలిపారు. గత కొద్ది రోజులుగా నీటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. చిన్నారులకు ఇదే నీటిని తాగించామని.. వేడి చేసుకొని తాగినా దుర్వాసన వచ్చేదని చెప్పారు.

వాటర్​ ట్యాంకులో మృతదేహం వివరాలు గుర్తింపు

ఇదీ చదవండి: Two Men Committed Suicide: భార్యలు తిట్టారని.. ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

Tollywood drug case: టాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో కొత్త ట్విస్ట్​!

Last Updated : Dec 8, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.