Road accident today: మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ విజువల్స్‌ను పోలీసులు విడుదల చేశారు. గాజులరామారానికి చెందిన మేఘన.. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నిన్న మధ్యాహ్నం తన స్నేహితురాలు సుమనశ్రీతో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణమైంది. గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వారిని టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో మేఘన అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థిని గాయలపాలైంది.
అదుపులో డ్రైవర్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థినిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: యాక్సిడెంట్ అంటే వాహనమో, మనిషో రోడ్డుపై పడిపోవటం కాదు... ఓ కుటుంబమంతా బజారున పడటం