ETV Bharat / crime

దా'రుణ' యాప్​ల కేసులో మరో నిందితుడు అరెస్ట్​

దా'రుణ' యాప్​ల కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. రుణ యాప్​ల డైరెక్టర్​ హేమంత్​ జాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. బిహార్​లోని ఇషాక్‌చక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సబ్జీ మండిలోని హేమంత్ జా​ను అరెస్ట్​ చేశారు.

దా'రుణ' యాప్​ల కేసులో మరో నిందితుడు అరెస్ట్​
దా'రుణ' యాప్​ల కేసులో మరో నిందితుడు అరెస్ట్​
author img

By

Published : Jan 20, 2021, 7:54 AM IST

ఆన్‌లైన్ రుణా యాప్​ల డైరెక్టర్​ హేమంత్​ జాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్​లోని భాగల్పూర్ పోలీసుల సహకారంతో సోమవారం ఇషాచాక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో హేమంత్​ జాను పట్టుకున్నారు. గుజ్జీ చంద్రమోహన్​ ఆత్మహత్యకు రుణ యాప్​ల వేధింపులే కారణమని కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పలు చోట్ల గాలింపు చేపట్టి.. బిహార్​లో హేమంత జాను పట్టుకున్నారు.

హేమంత్​ కింద దాదాపు 150 మంది పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరు ఆన్​లైన్​ రుణ యాప్​ల్లో రుణాలు ఇచ్చి.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని చెప్పారు. పాన్ పాన్, రియోక్రాప్, క్యాష్ మ్యాప్, రూపి ప్లస్, కుష్ క్యాష్, మనీ మోర్, హోమ్ కరోరి, క్యాష్ సీడ్, క్యాష్ ఇరో మొదలైనవి రుణ యాప్​ల ద్వారా రుణాలిచ్చారని పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: వృద్ధురాలి అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.