ETV Bharat / crime

Anantapur road accident: అనంతపురంలో రోడ్డు ప్రమాదం... తెలంగాణ దంపతులు మృతి - ఏపీ క్రైమ్​ న్యూస్​

ఏపీలోని అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయిన ఓ కారు.. అదే లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి (Couple died in road accident) చెందారు. మృతులు తెలంగాణకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

Anantapur road accident
Anantapur road accident
author img

By

Published : Nov 27, 2021, 4:22 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Anantapur road accident) చోటుచేసుకుంది. ఐరన్ లోడుతో ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయిబోయిన కారు.. అదే లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే చనిపోగా(Couple died in anantapur road accident) .. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. గాయపడ్డ వెంకటేశ్​, రాజు, సోమ్ల నాయక్, సీతమ్మను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ నుంచి హిందూపురం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులు తెలంగాణలోని వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామిగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: young man suicide: వివాహిత తనతో మాట్లాడటం లేదని యువకుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.