Teak logs smuggling in AP : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీదేవిపేట శివారులో భూమిలోపల అక్రమంగా నిల్వ ఉంచిన 30 టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ బీట్ అధికారి మూర్తి... మరికొందరు సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు చేపట్టగా ఈ టేకు దుంగలు దొరికాయి. తనిఖీల విషయం తెలుసుకున్న మండలంలోని రాజపేటకు చెందిన వైకాపా నాయకులు మూర్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై చింతూరు డీఎఫ్‌వో సాయిబాబును వివరణ కోరగా... దాడి వాస్తవమేనని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
