ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బుధవారం తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక.. తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుడిపై బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Raju postmortem: ఎంజీఎం ఆస్పత్రికి రాజు కుటుంబసభ్యులు.. కాసేపట్లో మృతదేహానికి శవపరీక్ష