హైదరాబాద్ అబిడ్స్‌లోని సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ రైడ్‌లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. వారిలో సంతోష్ దాబా ఓనర్, మయూర్ పాన్ షాప్ ఓనర్‌తో పాటు.. మరో ఆరుగురు వ్యాపార వేత్తలను అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి రూ.73,860 నగదును, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసి వారిని తదుపరి విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పజెప్పినట్లు మద్యమండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన రెస్క్యూ టీం