హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. 9 మంది మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఆర్ నగర్ ప్రధాన రహదారి వైపున ఆర్కే ప్లాజాలో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక శాంతిభద్రతల విభాగం పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులు అరెస్ట్